తమిళనాడులో 11 గంటల వరకు 37.56 శాతం పోలింగ్
చెన్నై: గురువారం తమిళనాడులోని(Tamil Nadu elections 2026) 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగిన పోలింగ్‌లో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఉదయం 11 గంటల సమయానికే, సుమారు 5.73 కోట్ల మంది ఓటర్లలో దాదాపు 38 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది. భారత ఎన్నికల సంఘం (EC) గణాంకాల ప్రకారం, ఉదయం సరిగ్గా 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ ప్రక్రియలో, మొదటి నాలుగు గంటల సమయానికి ఓటింగ్ శాతం 37.56 శాతంగా నమోదైంది. ఉదయం 11 గంటల వరకు సుమారు రెండు కోట్ల మంది ఓటర్లు తమ ఓట్లను వినియోగించుకున్నారని ఎన్నికల సంఘం తెలిపింది.
తమిళనాడు ఎన్నికల తాజా అప్‌డేట్లు, పోలింగ్ శాతాలు నిమిషాల వ్యవధిలో తెలుసుకోవడానికి విజయక్రాంతి హోమ్‌పేజ్ సందర్శించండి.
తమిళనాడులో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. డీఎంకే తరుఫున కొలత్తూరు నుంచి పోటీ చేస్తున్న సీఎం స్టాలిన్, తన కుటుంబసభ్యులతో కలిసి చెన్నైలో ఓటేశారు. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్(Deputy Chief Minister Udhayanidhi Stalin), టీవీకే చీఫ్ విజయ్, ఎంఎన్ఎం చీఫ్ కమల్ హాసన్, శృుతిహాసన్, రజనీకాంత్ చెన్నైలో ఓటేశారు. సాలెం ప్రాంతంలో అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి ఓటేశారు. ఏఎంఎంకే నేత టీటీవీ దినకరణ అడయార్ లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తిరుచిరాపల్లి ఈస్ట్, పెరంబూరు నుంచి విజయ్ బరిలో నిలిచారు. ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు తగిన చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి:
బెంగాల్ ఎన్నికలు: 11 గంటల వరకు 41.11 శాతం పోలింగ్.. ముర్షిదాబాద్‌లో ఘర్షణలు
చెన్నైలో ఓటు హక్కు వినియోగించుకున్న ప్రముఖులు






