23 April, 2026 | 12:39 PM

వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్

23-04-2026 11:35 AM

వరంగల్ (విజయక్రాంతి): వరంగల్ నగర పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఇద్దరు ఎస్ఐ లను విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎస్ ఐ రవి కుమార్ తో పాటు, ప్రస్తుతం సి.ఏ.ఆర్ విభాగంలో అటాచ్డ్ లో ఉన్న  ప్రవీణ్ కుమార్ పై వచ్చిన ఆరోపణపై సమగ్ర విచారణ జరిపి వచ్చిన ఆరోపణను నిర్ధారణ కావడంతో ఇరువురి ఎస్ ఐ లను సస్పెన్షన్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతిసింగ్ గత రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.