23 April, 2026 | 1:25 PM

భగీరథుని ప్రయత్నం చరిత్రలో మహత్తర ఘట్టం

23-04-2026 11:53 AM

భగీరథ మహర్షి విగ్రహం కు పూలమాల వేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ కుష్బూ గుప్తా

మహబూబ్ నగర్ (విజయక్రాంతి) : భగీరథ మహర్షి ప్రయత్నం దేశ చరిత్రలో మహత్తర ఘట్టమని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని గ్రీన్ బెల్ట్ దగ్గర భగీరథ మహర్షి విగ్రహానికి జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మేయర్ గుమాల్ మమత ల తో పాటు పలువురు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...   గంగానదిని భూమికి తీసుకువచ్చిన మహానుభావుడిగా భగీరథుడికి కీర్తి ప్రతిష్టలు తమ సొంతం చేసుకున్నారని, ప్రజల దాహాన్ని తీర్చిన గొప్ప సేవల స్మరణ, లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసిన భగీరథ కృషి అన్నారు. భారతదేశం అన్నపూర్ణగా నిలవడానికి భగీరథుని సేవలే కారణని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు కార్యకర్తలు తదితరులు ఉన్నారు.