నకిలీ ఎన్ సీసీ శిబిరంలో బాలికపై అత్యాచార ఘటన.. నిందితుడు మృతి
23-08-2024 04:12 PM
చెన్నై: తమిళనాడులోని కృష్ణ గిరి జిల్లా బర్గూరు సమీపంలోని ఓ ప్రైవేటు పాఠ శాలలో ఎన్ సీసీ శిబిరం నిర్వహించారు. కానీ తల్లిదండ్రులను సైతం ఏమార్చేలా నిందితులైన కీచక ఉపాధ్యాయులు నకిలీ ఎన్ సీసీ శిబిరాన్ని ప్లాన్ చేశారు. ఈ శిబిరంలో భాగంగా 17 మంది విద్యార్థినులు పాల్గొనగా వారికి అక్కడే బస ఏర్పాటు చేశారు. పలు లైంగిక వేధింపుల కేసుల్లో నిందితుడుగా ఉన్న శివరామన్ ఈ శిబిరంలో 13 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అరెస్టు కు ముందే పురుగుల మందు తాగిన నిందితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడని పోలీసులు తెలిపారు. ఈ కేసులో 11 మందిని అరెస్టు చేశారు.






