కేటీఆర్, హరీశ్ రావుకు మంత్రి పొంగులేటి సవాల్
హైదరాబాద్: మార్పు ఇందిరమ్మ రాజ్యంతోనే సాధ్యమని తెలంగాణ ప్రజలు కాంగ్రెస్‌ని దీవించారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా భావించి సీఎం రేవంత్ పనిచేస్తున్నారని తెలిపారు. అధికారంలో వచ్చాక ఖజానా చూస్తే రూ.7 లక్షల కోట్లు అప్పు ఉన్నా ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం వెంటనే 5 పథకాలు అమలు చేశామని వెల్లడించారు.
హైడ్రాను మంచి ఉద్దేశంతో తెచ్చామని మంత్రి పొంగులేటి సూచించారు. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ లో నిర్మాణాలను అనుమతించేది లేదని మంత్రి వెల్లడించారు. అక్రమ కట్టడాలను మాత్రమే హైడ్రా కూల్చుతోందన్నారు. గత ప్రభుత్వ హయాంలోని ఆక్రమణలనే హైడ్రా కూల్చుతోందని తెలిపారు. హిమయత్ సాగర్, ఎఫ్ టీఎల్ పరిధిలో తన ఫామ్ హౌజ్ ఉందని అంటున్నారని పొంగులేటి అన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్, హరీశ్ రావుకు మంత్రి పొంగులేటి సవాల్ విసిరారు. అధికారుల బదులు మీరే వెళ్లి ఎఫ్ టీఎల్ పరిధి కొలవండన్నారు. అక్రమంగా ఉంటే తన ఇల్లూ వెంటనే కూల్చాలని హైడ్రాకు చెప్తున్నానని మంత్రి వెల్లడించారు. తన ఫామ్ హౌజ్ అక్రమం అని తేలితే కూల్చేయండని మంత్రి అధికారులకు సూచించారు.






