calender_icon.png 31 December, 2025 | 9:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంథని నియోజకవర్గాన్ని రాయలసీమల మార్చేందుకు మధు కుట్ర

31-12-2025 07:34:16 PM

ముత్తారం,(విజయక్రాంతి): మంథని నియోజకవర్గాన్ని రాయలసీమలగా మార్చేందుకు పుట్ట మధు ప్రయత్నిస్తున్నాడని, రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు కుటుంబ సభ్యులపై అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందెదుకు పుట్ట కుట్ర చేస్తున్నాడని బుధవారం మంథనిలో విలేకరుల సమావేశంలో ముత్తారం మాజీ జడ్పిటిసి చొప్పరి సదానందం, ముత్తారం కాంగ్రెస్ పార్టీ దొడ్డ బాలాజీలు అన్నారు.

దుద్దిళ్ల కుటుంబంపై ఆరోపణలు చేస్తున్న పుట్ట మధు... నీ కుటుంబ సభ్యుల గురించి ఇప్పుడైనా మాట్లాడామా... మాట్లాడితే నీ పరిస్థితి ఏందో నీకు తెలుసు కదా... రాజ్యాంగం దగ్గర పెట్టుకొని తిరుగుతున్న అంటున్నావు కదా.. నిజంగా నువ్వు రాజ్యాంగం చదువుతావా... ఒక చిన్న పాపతో పోటీపడి రాజ్యాంగం చదివితే మేమందరం నీకు గులాం గిరి చేస్తాం. 2014లో తెలంగాణ సెంటిమెంటుతో గెలిచిన నువ్వు మంథనిలో మా కాంగ్రెస్ కార్యకర్తలను వేధించలేదా... మా కార్యకర్తలే సైనికుల పనిచేసి నిన్ను చిత్తుచిత్తుగా ఓడించారు. రాబోయే రోజుల్లో నీకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారు పుట్టా అని వారు హెచ్చరించారు.‌