31-12-2025 07:30:22 PM
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల కేంద్రం అర్వపల్లిలో స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చిల్లంచర్ల విద్యాసాగర్ ను గ్రామ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించారు.దీంతో కాసర్లపహాడ్ గ్రామ హనుమాన్ ఆటో యూనియన్ నాయకులు బుధవారం అర్వపల్లిలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ విద్యాసాగర్ ను శాలువాలు, బొకేలతో సత్కరించి, సన్మానించారు. ఆటో యూనియన్ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు బొల్లం వీరమల్లు, దండుగుల వెంకన్న, సిరికొండ సత్యనారాయణ, ఎల్లయ్య, యాదగిరి, అంజయ్య, సైదులు, సంజీవ, సాయి, నరేష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.