01-02-2026 03:47:01 PM
దేవరకొండ,విజయక్రాంతి: రాజకీయ కక్షతోనే బిఆర్ఎస్ అధినేత కెసిఆర్ గారిపై తప్పుడు కేసులు బనాయించి, రేవంత్ రెడ్డి ప్రభుత్వ పాలనా వైఫల్యానికి నిదర్శనమని బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం తెలంగాణ జాతి పిత, కోట్లాదిమంది ప్రజల ఆరాధ్యుడు కేసీఆర్పై రాజకీయ కక్షతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుతంత్రాలకు నిరసనగా దేవరకొండ పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద రాస్తారోకో నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫోన్ ట్యాపింగ్ కేసు పేరుతో ప్రతిపక్షాన్ని భయపెట్టే ప్రయత్నాలు చేయడం ప్రజాస్వామ్య విలువలకు అవమానం అని అభిప్రాయపడ్డారు. కేసీఆర్ పై సిట్ అధికారుల దర్యాప్తు ప్రభుత్వ దివాలకోరు తనానికి నిదర్శనం అని ఆయన అన్నారు. కేసీఆర్ ను ఎదుర్కోలేక కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగల్లా ఒక్కటై పనికి మాలిన చెత్త ఆరోపణలు చేస్తున్నారు. కేసీఆర్ పై లేని కేసును సృష్టించి ఈ ప్రభుత్వం తమ పబ్బం గడుపు కుంటున్నారని ఆయన తెలిపారు.
రేవంత్ రెడ్డి బావమరిది సుజన్ రెడ్డి బొగ్గు గనుల కేటాయింపు కుంభకోణాన్ని బయటపెట్టినందుకే, ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు ఈ డైవర్షన్ పాలిటిక్స్ అని అన్నారు.ప్రజల తరఫున గట్టిగా మాట్లాడుతున్న బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని, మాజీ మంత్రి హరీష్ రావుని, మాజీ రాజ్యసభ సభ్యులు సంతోష్ గారిని ఎదుర్కోలేక, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై అక్రమ కేసులతో దాడి చేయడం ఈ ప్రభుత్వ భయానికి నిదర్శనం అని, చట్టం, న్యాయవ్యవస్థలపై మాకు పూర్తి గౌరవం ఉందన్నారు. మంత్రులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ నీతిమాలిన పనులకు పాల్పడుతున్నారు.
ఇది స్కీముల ప్రభుత్వం కాదు, స్కాముల ప్రభత్వం.. ప్రజలు ఎప్పుడో గమనించారు అని,మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు గట్టి బుద్ధి చెబుతారు అని ఆయన అన్నారు. కేసీఆర్ పై సిట్ అధికారులు అత్యుత్సాహం చూపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మా నాయకులపై లేని కేసులు పెట్టి డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రభుత్వం అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇంచార్జీ పాల్వాయి స్రవంతి, నేనావత్ కిషన్ నాయక్, కేతావత్ బిల్యా నాయక్, బిఆర్ఎస్ మండల అధ్యక్షులు TVN రెడ్డి, చింతపల్లి సుభాష్, గాజుల ఆంజనేయులు, నీల రవికుమార్,జర్పుల లోక్య నాయక్, బోయపల్లి శ్రీనివాస్ గౌడ్,వేముల రాజు, బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ తదితరులు పాల్గొన్నారు.