01-02-2026 03:20:58 PM
ఒక మంచి యువ నాయకుడిని కోల్పోయాం.. ఆయన కుటుంబానికి అండగా ఉంటాం..
మాజీ ఎమ్మెల్యే పైలెట్
తాండూరు,(విజయక్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూరు బీఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు, వీర శైవ యువ మాజీ దళ్ మాజీ అధ్యక్షులు ఇందూరు మాజీ ఎంపీటీసీ పటేల్ ప్రవీణ్ కుమార్ మృతి పార్టీకి తీరని లోటని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అన్నారు. ప్రవీణ్ కుమార్ గత మూడు రోజుల క్రితం ఆత్మహత్యాయత్నాంకి పాల్పడి హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు వీరసేవ సమాజ సభ్యులతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా పైలట్ మాట్లాడుతూ
ప్రవీణ్ కుమార్ మరణం పార్టీకి తీరని లోటని పార్టీ ఒక మంచి ధైర్యవంతుడిని కోల్పోయిందని అన్నారు. ఆత్మహత్యకు దిగడం చాలా బాధాకరం అని అన్నారు. గత కొద్ది రోజులుగా పటేల్ ప్రవీణ్ తీవ్ర మానసిక వత్తిడిలో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారని అన్నారు 10 శాతం వడ్డీకి అప్పులు ఇచ్చిన వ్యక్తులు తమ డబ్బును రాబట్టుకునేందుకు పటేల్ ప్రవీణ్ పై వత్తిడి తేవడం తో మానసికంగా తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారని అన్నారు.
మరోవైపు గత కొద్ది రోజులుగా శ్రీ వీరభద్రేశ్వర దుకాణ సముదాయం కోర్టు కేసుకు సంబంధించి రాజకీయ పరంగా కూడా పటేల్ ప్రవీణ్ పై వత్తిడి చేసినట్టు వెల్లడించారు. నిత్యం ఫోన్లు చేయడం..కొందరు నేతలు ఇంటికి రావడం చేస్తున్నట్లు కోర్టులో కేసును వెనక్కి తీసుకోవాలని రాజకీయ నేతలు వత్తిడి తీసుకువచ్చారని రోహిత్ రెడ్డి తెలిపారు. యువకులు వత్తిడికి లోను కాకుండా క..బతికి సాధించుకోవాలని..క్షణికావేశం వద్దని రోహిత్ రెడ్డి సూచించారు. పటేల్ ప్రవీణ్ కుటుంబానికి పార్టీతో పాటు నేను అండగా ఉంటానని అన్నారు.