3 April, 2026 | 2:58 AM

గన్యాతండా నుంచి 20 కుటుంబాలు బీఆర్‌ఎస్‌లో చేరిక

03-04-2026 01:23 AM

కూసుమంచి, ఏప్రిల్ 2 (విజయక్రాంతి): కూసుమంచి మండలంలోని గన్యాతండాలో 20 కుటుంబాలు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారందరికి ఉపేందర్ రెడ్డి కండువా కప్పి స్వాగతం పలికారు. గన్యతండలో గురువారం సేవలాల్ మహారాజ్, మేరమ్మ యాడి నూతన దేవాలయాల కమిటీ ఆహ్వానం మేరకు, ఆ ఆలయాలను సందర్శించారు. వారు ప్రత్యేక పూజలు చేసి, కమిటీ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉపేందర్ రెడ్డి గారు భవిష్యత్తులో గన్యతండను అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. 

పలు గ్రామాల్లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే..

కూసుమంచి మండలంలోని పలు గ్రామాల్లో మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి పర్యటించారు. ధర్మతండా, పాలేరు, కూసుమంచి తదితర గ్రామాల్లో పర్యటించారు. నవ దంపతులను ఆశీర్వదించారు. కార్యకర్తలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు వేముల వీరయ్య, నాయకులు ఇంటూరి శేఖర్, జర్పుల బాలాజీ నాయక్, ఆసీఫ్ పాషా, వడ్తియా బాలకృష్ణ పాల్గొన్నారు.