సంక్షేమ పథకాల ఎంపికపై అధికారులు పారదర్శకంగా వివరించాలి
చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య.
శంకర్ పల్లి: ఏప్రిల్ 2 (విజయ క్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు... ఎంపికపై అధికారులు పారదర్శకత వహించాలని చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పేర్కొన్నారు. గురువారం నిర్వహించిన ప్రజా పాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం మున్సిపల్ చైర్మన్ సాత ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే యాదయ్య పాల్గొన్నారు. మున్సిపాలిటీలోని అన్ని వార్డులలో గ్రామసభలు జరిగా అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాల అమలులో లబ్ధిదారుల వివరాలను తెలియజేసేందుకు వార్డులలో సభలు నిర్వహించడం జరిగిందన్నారు. వార్డులలో ఉన్న తమ సమస్యలను సభ దృష్టికి తీసుకువస్తే ప్రత్యేక చర్యలు తీసుకొని పరిష్కరించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
వార్డులలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండి పారిశుద్ధ్యం, వీధి దీపాలు, మంచినీటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాల అమలులో అధికారుల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పు అని హెచ్చరించారు. వైస్ చైర్ పర్సన్ జూలకంటి శ్వేతా పాండురంగారెడ్డి, ప్రత్యేక అధికారి పూర్ణిమ, కమిషనర్ యోగేష్, మేనేజర్ అంజన్ కుమార్ ఆయా వార్డుల కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.
14వ వార్డులో..
మున్సిపల్ పరిధిలోని 14 వ వార్డులో వైస్ చైర్పర్సన్ జూలకంటి శ్వేతా పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో వార్డు సభ కార్యక్రమం నిర్వహించారు. వార్డులో ఉన్న ప్రధాన సమస్యలను ఆ ప్రాంత ప్రజలు సభ దృష్టికి తీసుకువచ్చారు.
వార్డులోని ప్రధాన రోడ్డు లోక అబ్జర్వ్ చేసి ఏర్పాటుచేసిన డబ్బాలను తొలగించాలని, ఇది దీపాల సమస్య ఎక్కువగా ఉందని, ఆడిటోరియం వెనకాల అండర్ డ్రైనేజ్ సమస్య తీవ్రమైందని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు అందకుండా అధికార పార్టీ అనుచర వర్గానికి ఇష్టానుసారంగా ఎంపిక చేశారని వినతి పత్రం అందజేశారు. వాటిలో రోడ్లను ఆక్రమించి ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడంలేదని వినతిపత్రంలో పేర్కొన్నారు.
బుల్కాపూర్ సభలో రసాభాస..
మున్సిపల్ పరిధిలోని 4,5 వార్డులల్లో నిర్వహించిన వార్డు సభలు రసాభాసగా సాగాయి. అధికారుల ముందే నూతనంగా ఎంపికైన కౌన్సిలర్ మణికొండ లలిత, భానూరి కృష్ణ పై విరుచుకుపడ్డారు. తమ వార్డులలో డబుల్ బెడ్ రూమ్ ఎంపిక పై ప్రజలు ప్రశ్నించారు. తమకు నచ్చిన వారికి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ఏ విధంగా కేటాయిస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇల్లు లేని నిరుపేదల కోసం డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను కేటాయించమని సూచిస్తే అనర్హులకు ఇల్లను ఏ విధంగా కేటాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వార్డులో గ్యాస్ సిలిండర్ల సమస్య తీవ్రంగా ఉందని కౌన్సిలర్లు ఎందుకు పట్టించుకోవడంలేదని పడ్డారు. గ్యాస్ సబ్సిడీ పైసలు కూడా సక్రమంగా అందడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం అందించే కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు కూడా అందడం లేదని, ఇప్పటివరకు రేషన్ కార్డులు కూడా రాలేవని తెలిపారు. ప్రజా సమస్యల కోసం గెలిచి... తమను పట్టించుకోకపోతే ఎవరిని అడగాలని ప్రశ్నించారు.




