calender_icon.png 8 November, 2025 | 9:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఒకే చోట కుప్పగా పాములు

08-11-2025 08:01:06 PM

జడ్చర్ల: నసురుల్లాబాద్ గ్రామ సమీపంలో కావాలి యాదయ్య అనే రైతు పొలంలో ఇల్లు కట్టుకున్నాడు. శనివారం మధ్యాహ్నం తన ఇంటి సమీపంలో పాము ఉండటం గమనించి సర్పరక్షకుడు డా.సదాశివయ్యకి సమాచారం అందించారు. సదాశివయ్య శిష్యులు రవీందర్, భరత్ కు అక్కడికి చేరుకుని చూడగా ఒక బండ కింద ఒక్కొక్కటిగా 7 వాన కోయిల (బాండెడ్ రేసర్) పాములు బయటకి వచ్చాయి. అన్నిటిని పట్టుకుని కుటుంబ సభ్యులకు జాగ్రత్తలు చెప్పారు.

అర్జరోజైన్ ఫెసియోలేట అనే శాస్త్రీయ నామం గల ఈ పాములు కొలుబ్రిడే కుటుంబానికి చెందినవని, విషరహిత పాములని డా. సదాశివయ్య తెలిపారు. ఈ జాతికి చెందిన పాములు సాధారణంగా రెండు కలసి ఉంటాయని అంత కంటే ఎక్కువ కలసి ఉండటం అరుదు అని తెలిపారు. ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు ఇలా ఒకే ప్రదేశం లో ఉండే అవకాశం ఉండవచ్చని అన్నారు. ప్రజలెవ్వరు పాములు కనిపిస్తే భయపడకుండా మాకు తెలియజేస్తే వాటిని సురక్షితంగా అటవీ ప్రాంతాల్లో వదిలేస్తామని తెలిపారు.