calender_icon.png 8 November, 2025 | 9:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాన్ బాస్కో కళాశాలలో చదివి ఉన్నత స్థాయికి ఎదగడం గర్వకారణం

08-11-2025 08:02:57 PM

సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ..

డాన్ బాస్కో కళాశాలలో పూర్వ విద్యార్థి కావడం నా జన్మ సుకృతం: కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విల్సన్

చండూరు (విజయక్రాంతి): డాన్ బాస్కో కళాశాలలో చదివి ఉన్నత స్థాయిలో ఎదగడం, ఈ కళాశాల పూర్వ విద్యార్థి కావడం నా జన్మ సుకృతమని సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహ, డాన్ బాస్కో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ విల్సన్ అన్నారు. శనివారం చండూరు మండల కేంద్రంలోని డాన్ బాస్కో కళాశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాలకరస్పాండెంట్ ఫాదర్ రాజేష్ అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, డాన్ బాస్కో కళాశాల స్థాపించి 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశామని, ఈ కళాశాలలో చదవడం వల్లనే నేడు ఉన్నత స్థాయిలో సేవలు అందిస్తున్నామని, దాని కారణం అధ్యాపకులేనని, వారి రుణం ఎప్పటికీ మర్చిపోలేమని తమ జ్ఞాపకాలని గుర్తు చేసుకున్నామని వారు అన్నారు. ఈ కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో సామాజిక వ్యవస్థలలో, వాణిజ్య, రాజకీయ, వ్యవసాయ, ప్రైవేట్ రంగాలలో అద్భుతమైన సేవలు అందిస్తూ ఉండడం గొప్ప విషయమని వారు కొనియాడారు.

అనంతరం డాన్ బాస్కో కళాశాల యజమాన్యం సూర్యాపేట జిల్లా ఎస్పీ కొత్తపల్లి నరసింహతోపాటు, ఉన్నత స్థానాలో ఎదిగిన వారందరినీ కూడా శాలువాతో సత్కరించారు. అంతేకాకుండా పూర్వ విద్యార్థులు డాన్ బాస్కో కలశాల యాజమాన్యాన్ని, అధ్యాపకులను ఘనంగా సత్కరించడంతోపాటు కళాశాల విద్యార్థులు సంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ కోడి శ్రీనివాసులు, సిఐ క్రాంతి, సీఐ రావిరాల శ్రీను,సీఐ శాంతం రెడ్డి, కోడి వెంకన్న, దోటి వెంకన్న, సిలివేరు రాజు, నగేష్ తదితరులు పాల్గొన్నారు.