11 May, 2026 | 8:35 PM

Breaking News

కాసిపేట గనిని సందర్శించిన జీఎం రాధాకృష్ణ   •   ప్రజావాణి ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలి: ఆర్డిఓ సుబ్రహ్మణ్యం   •   రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు – సేంద్రియ సాగుతోనే భవిష్యత్‌   •   అంబార్‌పేట్‌లో ఘనంగా శివగంగల కళ్యాణం   •   రేగులగుంటలో ఘనంగా నాభిశిల ప్రతిష్ట   •   ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి   •   ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా నిర్వహించాలి   •   గ్రామ అభివృద్ధి కొరకు కాంగ్రెస్ పార్టీ లో చేరిన వార్డ్ సభ్యులు   •   ఎంఈఓ చేతుల మీదుగా సమ్మర్ క్యాంప్ ప్రారంభం   •   మిల్లుల వద్ద వరి ధాన్యం లారీలను వేగంగా అన్లోడ్ చేసేలా చర్యలు తీసుకోవాలి   •  

ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు మృతి

11-05-2026 07:52 PM

సదాశివ నగర్ లో విషాదఛాయలు

సదాశివ నగర్,(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు బావిలో పడి ఓ రైతు మృతి చెందిన ఘటన సోమవారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. సోషల్ గ్రామానికి చెందిన కురుమ  జోగిని లింగం (50) అనే రైతు ఉదయం వ్యవసాయ బావి వద్దకు వెళ్లాడు. పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు తిరిగి ఇంటికి రాలేదు. బావి పక్కనే వెళుతూ ఉండగా ప్రమాదవశాత్తు జారీ  బావిలో పడి మృతి చెందారు.

కుటుంబ సభ్యులు ఇంటికి రాకపోవడంతో భావి వద్దకు వెళ్లి వెతకగా భావి వద్ద జారిపోయి పడిన ఆనవాళ్లు కనిపించడంతో బావిలో వెతికారు. లింగం శవం బావిలో బయటపడింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదవశాత్తు బావిలో పడి రైతు లింగం మృతి చెందినట్లు భావిస్తున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సదాశివ నగర్ పోలీసులు తెలిపారు. రైతు లింగం మృతి చెందడంతో సదాశివ నగర్ లో విషాద ఛాయలు అ లుముకున్నాయి.