18 August, 2026 | 12:32 PM

Breaking News

ఫర్నిచర్ షాప్‌లో అగ్నిప్రమాదం.. కార్మికుడి సజీవదహణం   •   కస్తూర్బా బాలికల ఆశ్రమ పాఠశాలలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆకస్మిక తనిఖీ   •   ఖర్గేను అవమానిస్తారా.. బీజేపీ వైఖరిపై టీపీసీసీ ప్రధాన కార్యదర్శి శ్రీను బాబు ఫైర్   •   రోడ్డు కోసం పొలం పోతుందని రైతు ఆత్మహత్యాయత్నం   •   గ్రామ గ్రామాన జల సంరక్షణ పనులు చేపట్టండి   •   అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ రైస్ పట్టివేత   •   ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఎంఎంసి కమిషనర్‌కు వినతి   •   ఆర్టీఐ చట్టం సాధన కమిటీ జిల్లా ఉపాధ్యక్షురాలిగా జయకుమారి   •   తహసిల్దార్ కార్యాలయంలో దూరిన పాము   •   కోర్టు ఆదేశాలతో గిరిజన మహిళకు న్యాయం   •  

నాభి శిల బొడ్రాయి ప్రాణ ప్రతిష్ఠ

11-05-2026 07:50 PM

- అంగరంగ వైభవంగా ఉత్సవాలు 

కొండపాక: కుకునూరుపల్లి మండల కేంద్రంలో సోమవారం నాభి శిల (బొడ్రాయి) ప్రాణ ప్రతిష్ఠా మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గ్రామంలోని వందల ఏళ్ల నాటి పురాతన నాభి శిలను వెలికితీసి, గ్రామ నడిబొడ్డున నూతన నాభి శిల, పోతలింగేశ్వర స్వామి విగ్రహాలను శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు. పాండురంగ ఆశ్రమ గురువులు విఠల్ శర్మ పర్యవేక్షణలో అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య యంత్ర ప్రతిష్ఠ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మహా అన్నదానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్యక్రమంలో సర్పంచ్ మల్లం కనుకవ్వ ఐలయ్య, ఉప సర్పంచ్ దోంతి సత్తయ్య, మాజీ సర్పంచ్ కాసం నవీన్ కుమార్, పిఎన్ఆర్ ట్రస్ట్ అధినేత పోల్కంపల్లి నరేందర్, పాక్స్ వైస్ చైర్మన్ పిష్క అమరేందర్, మాజీ ఎంపిటిసిలు ఇండ్ల కనకయ్య , భూరమైన భూములు గౌడ్  ఇతర ప్రజాప్రతినిధులు  గ్రామస్థులు పాల్గొన్నారు.