5 March, 2026 | 2:45 AM

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

05-03-2026 01:09 AM

లక్ష్మణచందా, మార్చి 4 (విజయక్రాంతి): చేతికొచ్చిన పంటను అడవి జంతువుల నుంచి కాపాడుకున్నందుకు ఏర్పాటుచేసిన విద్యుత్ కంచె ఆ రైతు ప్రాణాన్ని తీసింది దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని  నర్సాపూర్ డబ్ల్యూ కు చెందిన కాయతి రవి (48 )అనే రైతు పంట రక్షణ కోసం ఏర్పాటుచేసిన విద్యుత్ తీగ తగిలి మృతి చెందారు. కనకపూర్ గ్రామ శివారులో గల తన సొంత చేనుకు మంగళ వారం రాత్రి విద్యుత్ తీగను అమర్చాడు.

బుధవారం ఉదయం కరెంటు తీగను తొలగిస్తుండగా ప్రమాదవ శత్తు తీగ తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పంట పొలానికి వెళ్లిన తన తండ్రి రాకపోవడంతో ఫోన్ చేసిన స్పందించలేదు. కుమారుడు తోటలోకి వచ్చి చూడగా తండ్రి మృత్యువాత పడి ఉండడం బోరున విలపించాడు.

కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు అక్కడికి తరలివచ్చి కన్నీరు మున్నేరైనరు .పండగ పూట ఈ విషాదం జరగడంతో గ్రామంలో సైతం పూర్తిగా విషాదఛాయలు నెలకొన్నాయి. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. నర్సాపూర్ కనకాపూర్ మల్లేష్ యాదవ్.సింగం రాజ్యలక్ష్మి వెంకటరాజ్ సర్పంచులు విషయం తెలుసుకుని సంఘటన స్థలానికి చేరుకొని కుటుంబ సభ్యులను ఓదార్చారు. సంఘటన స్థలాన్ని. లక్ష్మణ్ చందా ఎస్సై శ్రావణి సందర్శించి కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నారు.