ఐక్యతకు సోదరభావానికి ప్రతీక హోలీ
సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్‌బాబు
ఉమ్మడి జిల్లా ఉత్సాహభరితంగా హోలీ సంబురాలు
కలెక్టర్ క్యాంపు కార్యాలయాల్లో ఘనంగా హోలీ వేడుకలు
నిర్మల్/కుభీర్/కాగజ్‌నగర్/ఆదిలాబాద్/ఉట్నూర్, మార్చి 4 (విజయక్రాంతి): కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం సాయం త్రం హోలీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ హోలీ వేడుకలలో కలెక్టర్ అభిలాష అభిన వ్ దంపతులు, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఏఎ స్పీ సాయికిరణ్, డిఎఫ్‌ఓ సుశాంత్ సుఖదేవ్ బోబడే, ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ఒకరికొకరు రంగులు చల్లుకుంటూ, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
కాగజ్‌నగర్ పట్టణంలో..
కాగజ్‌నగర్ పట్టణంలో బుధవారం హోలీ పండుగను ప్రజలు ఘనంగా, ఉత్సాహభరితం గా జరుపుకున్నారు. చిన్నాపెద్ద తేడా లేకుండా అందరూ పరస్పరం రంగులు చల్లుకుని ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. వీధులు, కాల నీలు రంగుల హరివిల్లుల్లా కళకళలాడాయి. ఒకరికొకరు హోలీ శుభాకాంక్షలు తెలుపుకుం టూ స్నేహభావంతో వేడుకలను నిర్వహించారు. సిర్పూర్ ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీ ష్‌బాబు నివాసంలో ప్రత్యేకంగా హోలీ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోలీ పండుగ సోదరభావానికి, ఐక్యతకు ప్రతీక అని తెలిపారు. రంగుల పండుగలా ప్రతి ఒక్కరి జీవితం సంతోషాలతో,విజయాలతో నిండాలని ఆకాంక్షించారు.
భైంసా డివిజన్ పరిధిలో..
భైంసా డివిజన్ పరిధిలోని కుబీర్ బైంసా తానూర్ రైతుల మండలాల్లో బుధవారం హోలీ పండుగను జరుపుకున్నారు. సర్పంచ్ బందెల సత్యనారాయణ ఆధ్వర్యంలో ఒకరిపై ఒకరు రంగులు సల్లుకొని హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పలు గ్రామాల్లో హో లీ ఉత్సవ ర్యాలీలు నిర్వహించారు. గోడపూర్‌లో సర్పంచ్ దత్త హరి పటేల్, నాయకులు గ్రామాల ప్రజలు యువకులు పాల్గొన్నారు.
ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో..
ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలను ప్రజలు రెండు రోజులుగా జరుపుకు న్నారు. మంగళవారం పలువురు హోలీ వేడుకల్లో పాల్గొనగా, బుధవారం సైతం పలువురు హోలీ పండగను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఇందులో భాగంగానే ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలో హోలీ రెండో రోజున రంగులు చల్లుకుంటూ హోలీ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం చంద్ర గ్రహణం ఉండడంతో రంగుల పండుగను జరుపుకోలేదు. దీంతో బుధవారం ఉద యం నుంచి యువతి, యువకులు రంగు నీళ్లు చల్లుకుంటూ పండగను ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. జిల్లా కేంద్రంతోపాటు ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలోని ఉట్నూర్, ఇంద్రవెల్లి, నార్నూర్, గాదిగూడ మండలాల్లో గిరిజనులు రంగుల పండుగ హోలీకి ఘనంగా జరుపుకున్నారు.
కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో..
హోలీ పండుగ వేడుకలు జిల్లా వ్యాప్తంగా రెండవ రోజు ఘనంగా నిర్వహించారు. ఇందు లో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో బుధవారం అధికారులు హోలీ వేడుకలు ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. హోలీ వేడుకలలో కలెక్టర్ రాజర్షి షా ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులు కలెక్టర్‌కు రంగులు చల్లుకుంటూ, హోలీ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. అదేవిధంగా అధికా రులతో కలిసి కలెక్టర్ నృత్యాలు చేస్తూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ వేడుకలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, జిల్లా ఎస్పీ కార్పొరేషన్ ఈడి మనోహర్, సంక్షేమ అధికారి మిల్కా, డిపిఓ రమేష్, డిఎంహెచ్‌ఓ నరేందర్ రాథోడ్, డివైఎస్‌ఓ శ్రీనివాస్, ఎల్దియం ఉత్పల్ కుమార్, మున్సిపల్ కమిషనర్ రాజు, మెప్మా పిడి రాజు, అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.




