11 July, 2026 | 2:41 PM

కడ్పల్ లో పాము కాటుకు రైతు మృతి

11-07-2026 01:34 PM

సిర్గాపూర్, జూలై 11(విజయక్రాంతి): సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని కడ్పల్ గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు సేనంగిల సాయిలు (45) శుక్రవారం రాత్రి పాము కాటుకు గురై మృతి చెందాడు. సమాచారం ప్రకారం, సేనంగిల సాయిలు వ్యవసాయ పనుల నిమిత్తం పొలానికి వెళ్లిన సమయంలో పాము కాటుకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స కోసం సిర్గాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రైతు మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనతో గ్రామస్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.