11 July, 2026 | 2:43 PM

గొడుగులు పంపిణీ చేసిన ఎడెల్లి శ్రీనివాస రెడ్డి

11-07-2026 01:35 PM

జనగామ, (విజయక్రాంతి): జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో శనివారం రోజున జనగామ శాసనసభ్యులు పల్ల రాజేశ్వర్ రెడ్డి  పుట్టినరోజు సందర్భంగా జనగామ జిల్లా నాయకులు ఎడెల్లి శ్రీనివాస్ రెడ్డి  తరిగొప్పుల స్థానిక బాలికల పాఠశాలలో విద్యార్థులకు గొడుగులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..  విద్యార్థులు చదువుపై దృష్టి సారించి ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. సమాజ అభివృద్ధికి విద్య ఎంతో కీలకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి, ముద్దసాని పద్మజ వెంకట్ రెడ్డి,  తాళ్లపల్లి రాజేశ్వర్ గౌడ్, జొన్నగొని సుదర్శన్, సర్పంచ్ మంచినీళ్ల రాజు, పింగిలి వేణుగోపాల్ రెడ్డి ఖాత టోనీ అంకం రాజారాం, చింతల జైపాల్ సుంకరి కనకరాజు నేతుల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.