17 April, 2026 | 8:35 PM

Breaking News

సోనాల బస్టాండ్ లో చలివేంద్రం ఏర్పాటు   •   ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రంలో అరైవ్-అలైవ్ సేఫ్టీపై అవగాహన   •   మా పట్టా భూమిలో ఎటువంటి నిర్మాణం చేపట్టొద్దు: పుట్ట వెంకటమ్మ   •   ప్రభుత్వమే మమ్ములను సమ్మెలోకి నెట్టుతుంది   •   స్థలం కేటాయిస్తే బస్టాండ్ నిర్మాణం కోసం కృషి చేస్తాం   •   మున్సిపల్ కార్యాలయం వద్ద చలివేంద్రం ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్ రాజు   •   పీజీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు నాల్గవ సెమిస్టర్ పరీక్ష రుసుము నిర్ధారణ   •   ఉద్యమ రిజిస్ట్రేషన్ గురించి వివోఏలకు అవగాహన   •   శాతవాహనలో నల్ల బ్యాడ్జీలతో నిరసన   •   మల్లాపూర్‌లో బీజేపీ ఎంపీ దిష్టిబొమ్మ దహనం   •  

ఎమ్మార్వోకు లంచం ఇస్తూ వీడియో రికార్డ్ చేసిన రైతు

22-06-2025 09:25 AM

7 వేలే ఇస్తావా ? ఇంకొక వెయ్యి రూపాయలు ఇవ్వు అంటూ రైతును లంచం అడిగిన ఎమ్మార్వో రాజారావు

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): ఒకవైపు ఏసీబీ అధికారులు విస్తృతంగా దాడులు చేస్తూ లంచాధికారులను వలపని పట్టుకుంటున్న, మరోవైపు అధికారులు బహిరంగంగా లంచాలు దండకుంటన్న వైనం వెలుగు చూస్తున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండల( Aswapuram Mandal) తహసిల్దార్ రాజారావు ఒక రైతు నుంచి లంచం తీసుకుంటూ సెల్ఫోన్లో బందీ అయ్యాడు. వివరాల్లోకి వెళితే మండల పరిధిలోని నెల్లిపాక గ్రామానికి చెందిన రైతు తన పాస్ బుక్ లో భూ పట్టా పేరు మార్చడానికి తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లాడు. పేరు మార్పు జరగాలంటే లంచం ఇవ్వాల్సిందేనంటూ తాసిల్దార్ డిమాండ్ చేశారు.  దీంతో రైతు తన తనతో వచ్చిన మరో వ్యక్తి తో సెల్ ఫోన్ ద్వారా వీడియో రికార్డ్ చేయిస్తూ లంచం ఇచ్చాడు. ఆ విషయం తెలియక తహసిల్దార్ రూ 7 వేలే ఇస్తారా, ఇంకో వెయ్యి రూపాయలు ఇవ్వండి అంటూ లంచం రైతును అడగడం గమనార్హం. సదరు రికార్డ్ చేసిన వీడియోను సోషల్ మీడియాలో అప్లోడ్ చేయటంతో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.