11 August, 2026 | 1:10 PM

Breaking News

ప్రభుత్వ కళాశాలలో మెరుగైన వసతులు : ప్రిన్సిపాల్ హిమజ్యోతి   •   నా ఓటు గల్లంతైంది : ప్రకాష్ రాజ్   •   అధ్వాన్నంగా మారిన ప్రధాన రహదారి పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు   •   పశుపోషణతో రైతులకు అదనపు ఆదాయం   •   పాఠశాలకు తల్లిదండ్రుల జ్ఞాపకార్థం డ్రమ్స్ అందజేత   •   మానేరు వాగుపై మట్టి రోడ్డుకు గండి.. కాంట్రాక్టర్ అత్యుత్సాహం..!   •   ఘజియాబాద్ లో కూలిన మూడంతస్తుల భవనం   •   పోలీస్ స్టేషన్ పైకప్పు పెచ్చులూడిపడి ఏఎస్ఐకి గాయాలు   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి   •   తమిళనాడు అసెంబ్లీలో నీట్ విధానాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం   •  

చేగుంటలో అమానవీయ ఘటన..!

22-06-2025 11:59 AM

చేతబడి చేశాడని చెప్పుల దండ మెడలో వేసి ఊరేగింపు.

దళిత వ్యక్తికి ఘోర అవమానం.  ఆలస్యంగా వెలుగులోకి ఘటన.

 నాగర్ కర్నూల్, (విజయక్రాంతి):  నాగర్ కర్నూల్ జిల్లాలో మూఢనమ్మకాలు రాజ్యమేలుతున్నాయి. చేతబడి చేశాడన్న అనుమానంతో ఒక వ్యక్తిని చెప్పుల దండ మెడలో వేసి గ్రామంలో ఊరేగించారు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఆ వ్యక్తిపై అదే సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి చేత జరిపించిన ఈ అమానవీయ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీపేట మండలం చేగుంట గ్రామంలో శనివారం చోటు చేసుకోగా ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గ్రామస్తులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామంలోని ఒక వ్యక్తిపై మరో వ్యక్తి తరచు అనారోగ్యానికి గురవుతుండడంతో బిజినపల్లి మండల కేంద్రంలో గద్దె చెప్పించుకున్నాడు.

నీకు చేతబడి చేశారని చెప్పడంతో చేగుంట గ్రామంలోని కృష్ణయ్య అనే వ్యక్తిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో పెద్దల సమక్షంలో పంచాయతీ పెట్టి చిత్ర హింసలకు గురి చేయడంతో ఒప్పుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో శనివారం  గ్రామస్తులంతా తమ ఎడమకాలు చెప్పులను దండగ చేసి మెడలో వేసి గ్రామంలో రెండు రౌండ్లు ఊరేగించారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపారు. కానీ విషయం జరిగింది వాస్తవమేనని ఇరువర్గాలను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ప్రజలు మూఢనమ్మకాలతో అశాంతిని కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.