calender_icon.png 23 February, 2026 | 8:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి

23-02-2026 12:24:46 AM

28 వరకు ఫార్మర్ రిజిస్ట్రేషన్  

మరిపెడ, ఫిబ్రవరి 22 (విజయక్రాంతి): మరిపెడ మండలంలో ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తప్పనిసరి అని మరిపెడ ఏవో వీరాసింగ్ అన్నారు. మండలంలో ఇంకా ఫార్మర్ రిజిస్ట్రేషన్ చేయించుకోని రైతులు తప్పనిసరిగా ఈ నెల 28 వరకు నమోదు పూర్తి చేసుకోవాలని తెలిపారు. మండలంలో మొత్తం 22 వేల మంది పాస్ పుస్తకాలు ఉన్న రైతుల్లో 15 వేల మంది మాత్రమే ఇప్పటివరకు నమోదు చేసుకున్నారన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకొని రైతులకు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాల అమలు చేస్తున్న పథకాలు దూరమయ్యే అవకాశం ఉందన్నారు.