23-02-2026 12:25:51 AM
మంథని, ఫిబ్రవరి 22 (విజయ క్రాంతి): పెద్దపల్లి జిల్లాలోని మంథని, ముత్తారం, రామగిరి, కమా న్ పూర్, పాలకుర్తి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాటారం, మహాముత్తారం, మహదేవ్ పూర్, మల్హర్ రావు, పలిమెల ఇతర మండలాల్లో సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు మంజూరు అయినట్లు మంత్రి శ్రీధర్ బాబు పీఎం ఆకుల చంద్రశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
సీఎంఆర్‌ఎఫ్ 266 చెక్కులకు గాను దాదాపు కోటి 9 వేల రూపాయలు విలువ చేసే చెక్కులను మంథని మండలంలోని సీఎంఆర్ ఎఫ్ 43 చెక్కులకు గాను రూ.15,35,000 వేలు, ముత్తారం మండలంలోని సీఎంఆర్‌ఎఫ్ 31 చెక్కులు 12,01,000 వేలు, రామగిరి మండలంలోని సీఎంఆర్‌ఎఫ్ 44 చెక్కులు 14,19,000 వేలు, కమాన్ పూర్ మండలంలోని సీఎంఆర్‌ఎఫ్ 23 చెక్కులు పాలకుర్తి మండలంలోని సీఎంఆర్‌ఎఫ్ 8 చెక్కులు 2,79,500 వేలు,
ఇతర మండలాల్లో సీఎంఆర్‌ఎఫ్ 19 చెక్కులు రూ. 17,07,500 వేలు, కాటారం మండలంలోని సీఎంఆర్‌ఎఫ్ 28 చెక్కులు 6,54,000 వేలు, హాముత్తారం మండలంలోని సీఎంఆర్‌ఎఫ్ 16 చెక్కులు 5,54,000 వేలు, మహదేవ్ పూర్ మండలంలోని సీఎంఆర్‌ఎఫ్ 36 చెక్కులు 13,37,000 వేలు, మల్హర్ రావు మండలంలోని సీఎంఆర్‌ఎఫ్ 15 చెక్కులు 4,79,000 వేలు, పలిమెల మండలంలోని సీఎంఆర్‌ఎఫ్ 03 చెక్కులు 99,000 వేలు,
మంథని నియోజకవర్గంలోని పలు ఆస్పత్రిలలో అనారోగ్యంతో చికిత్స పొంది సహాయం కొరకు మంత్రి క్యాంప్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్న వారికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వీరికి ప్రభుత్వం నుండి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను మంజూరు చేపించారని, ఈ క్రింది చెక్కులను రేపటి నుండి మీకు ఫోన్ చేసి మీ ఊరి వద్దకు వచ్చి ఇవ్వడం జరుగుతుందని పీఏ తెలిపారు. లేదా అందుబాటులో లేనివారు మంథనిలో మంత్రి క్యాంప్ కార్యాలయంలో తీసుకోవాలని ఆయన కోరారు.