30 July, 2026 | 3:51 PM

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి మోదీ కుర్చీ కాపాడారు

30-07-2026 03:16 PM

విద్యార్థులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీ చేయాలి?

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో(Parliament Monsoon Sessionప్రతిపక్షాల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పబ్లిక్ పరీక్షల సవరణ బిల్లును(Anti-Paper leak bill2024లోనే NDA ప్రభుత్వం బిల్లు ఎందుకు తీసుకురాలేదని రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) ప్రశ్నించారు. విద్యార్థులకు జరిగిన నష్టాన్ని ఎవరు భర్తీచేయాలి?, పేపర్ లీక్ వల్ల విద్యార్థులు నష్టపోవాలా? అని ప్రశ్నించారు. పేపర్ లీక్ అనేది తలదించుకోవాల్సిన అంశం అన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి మోదీ కుర్చీ కాపాడారని ఖర్గే విమర్శించారు.

పేపర్ లీకేజీ(NEET UG paper leak) వల్ల నష్టపోయేది విద్యార్థులే, విద్యార్థుల ఆవేదనను అందరం అర్థం చేసుకోవాలన్నారు. నీట్ పేపర్ లీక్ వల్ల చాలామంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పేపర్ లీక్ కాకుండా ఏమాత్రం ముందస్తు చర్యలు చేపట్టలేదని ఆరోపించారు. ఢిల్లీలో నిరసన చేసిన విద్యార్థులపై లాఠీ ఛార్జి చేశారు, బాష్పవాయువు ప్రయోగించారని మల్లికార్జున్ ఖర్గే ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల చర్యలపై ఇంతవరకు కేంద్ర మంత్రి అమిత్ షా(Union Minister Amit Shah) నుంచి ఎలాంటి ప్రకటన రాలేదన్నారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై అమిత్ షా ఎందుకు మౌనంగా ఉన్నారని  రాజ్యసభ ప్రతిపక్ష నేత ప్రశ్నించారు.