రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం
ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి
భూత్పూర్, ఏప్రిల్ 26 : రైతుల సంక్షేమమే ప్రభుత్వ చేయమని, రైతులు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని దేవరకద్ర నియోజకవర్గం ఎమ్మెల్యే జి. మధుసూదన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా భూత్పూర్ మండల పరిధిలోని కొత్త మొల్గర, వెలికిచర్ల, భూత్పూర్ మున్సిపాలిటీ పట్టణంలోని కస్తూర్బా గాంధీ స్కూల్ పక్కన వరి కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని అన్నారు. రైతులకి కావలసిన అన్ని మార్కెట్ యార్డులో కల్పించామని తెలిపారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా తమ వడ్లని కొనుగోలు కేంద్రంలోని విక్రయాలు చేయాలని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు పక్షపాతి అని, రైతుకు పెట్టుబడి సహాయంగా రెండో విడత రైతుబంధు నిధులు విడుదల చేశారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ చైర్మన్ మూడవత్ బాలకోటి, కౌన్సిలర్ ప్రేమ్ కుమార్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేసి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ కదిరి శేఖర్ రెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు లిక్కీ నవీన్ గౌడ్, కొత్త మొల్గర గ్రామ సర్పంచ్ వెంకటేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హర్యానాయక్, తిరుపతి రెడ్డి, పవన్, ఆనంద రెడ్డి తో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






