27 April, 2026 | 1:46 AM

పెళ్లి కూతురుకు పుస్తే మెట్టెలు, నగదు సహాయం

27-04-2026 12:37 AM

ఎల్లంపేట్ బీజేపీ కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్

మేడ్చల్ అర్బన్ ఏప్రిల్ 26 (విజయక్రాంతి): ఎల్లంపేట్ మున్సిపల్ పట్టణంలోని కుమార్తె వివాహం సందర్భంగా పెళ్లి కూతురు తల్లి తండ్రులకు పుస్తే,మట్టెలతో పాటు రూ. 25000 ఆర్థిక సహాయం అందజేసినట్లు 24 వ వార్డు మున్సిపల్ బిజెపి కౌన్సిలర్ వచ్ పల్లి అర్చన శ్రీనివాస్ ముదిరాజ్ తెలియజేశారు.

ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ మున్సిపల్ పట్టణంలోని 24 వ వార్డుకు చెందిన ఆడపిల్లల పిల్లలకు  10 సంవత్సరాల నుండి పుస్తే, మట్టెలతో పాటు నూతన వస్త్రాలు ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ఆమె చెప్పారు. ఆర్థికంగా వెనుకబడిన సుమారు 1200 మంది ఆడపిల్లల పెళ్లిళ్లకు ఆర్థిక సహాయం పుస్తెలు, మట్టెలను అందజేయడం జరుగుతుందని కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ స్పష్టం చేశారు.

ఈసందర్భంగా పెళ్లికూతురు తల్లి దండ్రులు మాట్లాడుతూ తన కూతురు వివాహానికి పుస్తే మట్టెలతో పాటు ఆర్థిక సహాయం అందజేసిన కౌన్సిలర్ అర్చన శ్రీనివాస్ దంపతులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పెళ్లికూతురు తల్లి తండ్రులు బంధువులతో పాటు బీజేవైఎం జిల్లా సీనియర్ నాయకులు వచ్ పల్లి శ్రీనివాస్ ముదిరాజ్ పాల్గొన్నారు.