calender_icon.png 7 May, 2025 | 4:55 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అకాల వర్షాలతో రైతులు అల్లాడుతుంటే

21-04-2025 12:07:26 AM

  1. ముఖ్యమంత్రి విదేశీ పర్యటనలా?

వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడా చోరులంతా కలిసి మీటింగ్ పెడుతారా?

మందిరాలు, గురుద్వారా, వ్యవసాయ భూములను ఆక్రమించుకున్న దోపిడీదార్లు మీరు కాదా?

విష సర్పాల కంటే డేంజర్ మజ్లిస్ పార్టీ పెద్దపల్లిలో విలేకరుల సమావేశంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఫైర్

పెద్దపల్లి మార్చి 20(విజయ క్రాంతి) అకాల వర్షాలు, వడగండ్ల వానతో వేలాది ఎకరాల్లో పంట దెబ్బతిని రైతులంతా అల్లాడుతుంటే వాళ్లను ఆదుకోవాల్సిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జపాన్ పర్యటన పేరుతో విదేశాలకు వెళ్లడమేంటని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్  ప్రశ్నించారు. రైతులను ఆదుకోవాలని కనీసం మంత్రులకైనా ఆదేశాలివ్వాలని కోరారు. వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిన్న దారుస్సలాంలో జరిగిన బహిరంగ సభ ముమ్మాటికీ కాంగ్రెస్ స్పాన్సర్డ్ కార్యక్రమమేనని పునరుద్ఘాటించారు.

వక్ఫ్ ఆస్తులను దోచుకున్న బడా చోర్లంతా కలిసి నిన్నటి మీటింగ్ లో పాల్గొని బీజేపీపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. మజ్లిస్ నేతలు విష సర్పాల కంటే డేంజర్ అని వ్యాఖ్యానించారు.  ఆదివారం కేంద్ర మంత్రి బండి సంజయ్ ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు పెద్దపల్లికి విచ్చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి, స్థానిక నేతలతో కలిసి బండి మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్, మజ్లిస్ పార్టీల తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

దారుస్సలాంలో నిన్న మజ్లిస్  ఏర్పాటు చేసిన బహిరంగ సభ ముమ్మాటికీ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్డ్ ప్రోగ్రామని, రేవంత్ రెడ్డి ప్రభుత్వం కర్త, కర్మ, క్రియగా మారి ఆర్ధిక సాయం చేసి నిర్వహించిన ఈ సభ వక్ఫ్ ఆస్తులను కాజేసి ముస్లింల పొట్టకొట్టిన బడా చోర్లంతా కలిసి మీటింగ్ కు హాజరై ముస్లిం సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు.

విష సర్పాలు ఎంతటి ప్రమా దకరమో ముస్లింలపట్ల ప్రేమ నటిస్తూ వక్ఫ్ ఆస్తులను దోచుకుతింటూ ముస్లింలను మురికి కూపాల్లోకి నెట్టేసిన మజ్లిస్ నేతలు అంతకంటే డేంజర్ అని, అంబేద్కర్ పెట్టిన భిక్షవల్లే ప్రధాని కాగలిగానని నిండు పార్లమెంట్ లో ప్రకటించిన మహానేత నరేంద్ర మోదీ అని,  అంబేద్కర్ కు అసలు సిసలైన వారసుడు మోదీగారేనని,  ఏటా లక్షా 25 వేల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తున్న మహానేత, అంబేద్కర్ స్పూర్తితో దళిత, బడుగు, బలహీనవర్గాలకు రాజ్యాధికారాన్ని అందించిన గొప్ప పార్టీ బీజేపీ అని,

అంబేద్కర్ పేరును ఉచ్చరించే అర్హత కూడా ఒవైసీకి లేదని, వక్ఫ్ బిల్లును వ్యతిరేకిస్తున్న నాయకులను నేను అడిగేదొక్కటేనని,  సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ (సీడబ్ల్యూసీ) నివేదిక ప్రకారం దేశంలో 8 లక్షల ఎకరాలకు పైగా వక్ఫ్ ఆస్తులున్నాయని, వీటి విలువ రూ.  10 లక్షల కోట్ల రూపాయలకు పైమాటేనని, వక్ఫ్ ఆస్తుల్లో సగానికిపైగా కొల్లగొట్టింది వక్ఫ్ బోర్డు ముసుగులో పెత్తనం చెలాయిస్తున్న వాళ్లు కాదా? అని ప్రశ్నించారు.

వక్ఫ్ ఆస్తులపై ఏటా 12 వేల కోట్ల రూపాయలకు పైగా ఆదాయం వస్తుంటే... ఆ సొమ్మునంతా దిగమింగుతోంది మీరు కాదా?  హైడ్రాను ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి  వక్ఫ్ ఆస్తులపై విచారణ జరిపించే దమ్ముం దా?  ఎన్ని భూములు ఆక్రమణకు గురయ్యాయి? ఎవరు ఆక్రమించారు? అందు లో ఒవైసీ కుటుంబం ఎంత దోచుకుంది? వక్ఫ్ ఆస్తులపై ఏటా ఎంత ఆదాయం వస్తోంది? ఆ సొమ్మును వేటి కోసం ఖర్చు చేస్తున్నారు? పేదల సంక్షేమం కోసం ఎంత ఖర్చు చేశారనే వివరాలపై శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా?

అకాల వర్షాలతో వేలాది ఎకరాల్లో పంట నష్టపోయి రైతులంతా అల్లాడుతుంటే వారిని ఆదుకోవా ల్సిన ముఖ్యమంత్రి జపాన్ పర్యటన పేరు తో విదేశాలకు వెళ్లడం ఎంత వరకు కరెక్ట్ అన్నారు. గత ప్రభుత్వ హయాంలో పంట దెబ్బతిన్న రైతులకు పరిహారం ఇవ్వలేదని, ఈ ప్రభుత్వం అదే పంథా కొనసాగిస్తోందని, ఇకనైనా వెంటనే రైతులను ఆదుకోవాలని సీఎం మంత్రులకు ఆదేశాలివ్వాలని బండి సంజయ్ కోరారు. ఆయన వెంట జిల్లా బిజెపి, కార్యకర్తలు పాల్గొన్నారు.