24 March, 2026 | 5:25 PM

రైతులు ఉసురు తీసుకుంటున్నా చలనమేది..

05-07-2024 01:12 AM

ప్రభుత్వంలో చలనం లేదన్న మాజీ మంత్రి

సీఎం సొంత జిల్లా ఘటనపై స్పందించిన హరీష్ రావు

హైదరాబాద్, జూలై 4 (విజయక్రాంతి): రాష్ట్రంలో  రైతుల ఆత్మ హత్యలు నిత్యకృత్యమైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు లేకపోవడం బాధకరమని మాజీ మంత్రి హరీష్‌రావు ఎక్స్‌లో ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మంలో రైతు పురుగుల మందు తాగి ప్రాణాలు వదిలితే, సీఎం సొంత జిల్లాలోనే  ఓరైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారని పేర్కొన్నారు.  తాజాగా ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం, ఆలియా తండాలో మరో రైతు ప్రాణాలు వదిలేందుకు సిద్ధమయ్యాడన్నారు. రైతుల ఆత్మహత్యలు నివారించేందుకు వారి సమస్యలు పరిష్క రించేందుకు ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరమన్నారు. పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదని మండిపడ్డారు.