16-06-2025 12:08:36 AM
ఆరు పోస్టులకు ఇంటర్వ్యూలు నిర్వహించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
రాజన్న సిరిసిల్ల: జూన్ 15 (విజయక్రాంతి): జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం పరిధిలో వివిధ పోస్టులకు ఆదివారం ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయం పరిధిలో మొత్తం 16 పోస్టులకు ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసి, దరఖాస్తులు ఆహ్వానించారు. మొత్తం పోస్టులకు గాను 904 దరఖాస్తులు వచ్చాయి.
ఈ సందర్భంగా ఆదివారం జిల్లా సమీకృత కా ర్యాలయాల సముదాయంలో ఆరు రకాల పోస్టులు డిస్ట్రిక్ట్ చైల్ ప్రొటెక్షన్ ఆఫీసర్, ప్రొటెక్షన్ ఆఫీసర్లు 2, లీగల్ ఆఫీసర్, కౌన్సిలర్, సోషల్ వర్కర్ కోసం ఇంటర్వ్యూలు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా నిర్వహించా రు. ఈ సందర్భంగా విద్యార్హత, పని అనుభవం తదితర అంశాలపై అడిగి తెలుసుకు న్నారు. మిగతా 10 రకాల పోస్టులకు సోమ, మంగళవారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరా జంతెలిపారు.
భూ నిర్వాసితులకు పరిహార చెక్కులు పంపిణీ చేసిన కలెక్టర్
సిరిసిల్ల, జూన్ 15 (విజయ క్రాంతి): వేములవాడ పట్టణంలో ఆలయ రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న నిర్వాసితుల కు ఆదివారం చెక్కులు పంపిణీ చేశారు. వే ములవాడ తిప్పాపూర్ బ్రిడ్జి నుంచి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు రోడ్డు విస్తరణ చేపట్టనున్న సందర్భంగా భూము లు కోల్పోతున్న నిర్వాసితులకు జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, వేములవాడ ఆర్డీవో రాధాబాయి చెక్కులు పంపిణీ చేశారు. వేములవాడలోని 20 మందికి చెక్కులు అందజేశారు. ఇప్పటిదాకా మొత్తం 70 మందికి చెక్కులు అందజేసినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్.డి .సి. రాధాబాయి, రెవెన్యూ అధికారులు, తదితరులుపాల్గొన్నారు.