ప్రకృతి వ్యవసాయంపై రైతులకు అవగాహన

15-09-2026 | 08:24pm

కౌటాల,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ(Department of Agriculture) ఆధ్వర్యంలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్‌ కార్యక్రమం(National Natural Farming Mission Program) నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి బి. వెంకట్‌ ముత్యంపేట గ్రామానికి ఎంపికైన రైతులకు కిట్లను అందజేశారు.

ప్రకృతి వ్యవసాయం(natural farming)లో బీజామృతం, జీవామృతం, ఘనజీవామృతం, నీమాస్త్రం, దశపర్ణి కషాయం తయారీ, వినియోగం, ప్రయోజనాలపై రైతులకు అవగాహన కల్పించారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగాన్ని తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మళ్లాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారులు ఘన్ శ్యామ్,సాగర్, రాజేశ్వర్, రేష్మిత,కల్పన, డైరెక్టర్ సత్యనారాయణ,ప్రజాప్రతినిధులు, కృషి సఖీలు, రైతులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు