ప్రభుత్వం, సమాజం చేయి కలిపితేనే విద్యావ్యవస్థ బలోపేతం

15-09-2026 | 09:46pm

* రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్ సిటీ బ్యూరో,(విజయక్రాంతి): ప్రభుత్వం, పౌరసమాజం, పారిశ్రామిక రంగాలు కలిసికట్టుగా కృషి చేసినప్పుడే దేశంలో విద్యావ్యవస్థ మరింత బలపడుతుందని తెలంగాణ సమాచార సాంకేతిక, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు(Industries Minister Duddilla Sridhar Babu) స్పష్టం చేశారు. రౌండ్ టేబుల్ ఇండియా 'ఏరియా 9' వెండి పండగ వేడుకల(Round Table India Area 9 Silver Jubilee Celebrations)కు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన, మేడ్చల్ జిల్లా(Medchal District) దుండిగల్‌లో నిర్మించనున్న నూతన పాఠశాల నమూనాను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ​పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థులకు కూడా కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా అత్యుత్తమ మౌలిక వసతులు, నాణ్యమైన విద్య అందాలని శ్రీధర్ బాబు ఆకాంక్షించారు. ​రౌండ్ టేబుల్ ఇండియా సేవలు అభినందస్తూ... "ఫ్రీడమ్ త్రూ ఎడ్యుకేషన్" ప్రాజెక్ట్ కింద విద్యా రంగానికి రౌండ్ టేబుల్ ఇండియా అందిస్తున్న సాంకేతిక పరిజ్ఞానం, నిధులు, సభ్యుల శ్రమదానం ఎంతో ప్రశంసనీయమైన్నారు.

తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను ఆధునీకరించడానికి, మౌలిక వసతులను మెరుగుపరచడానికి ప్రభుత్వంతో కలిసి భాగస్వాములు కావాలని రౌండ్ టేబుల్ సంస్థకు పిలుపునిచ్చారు. ​ఈ వేడుకలో ఏరియా 9 ఛైర్మన్ త్రి. అనిరుధ్ సోంపల్లితో పాటు సంస్థ పూర్వ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు. మొదటి విడతలో భాగంగా రూ. 3.5 కోట్ల నుంచి రూ. 4 కోట్ల అంచనాతో ఈ పాఠశాలను నిర్మించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

మరిన్ని వార్తలు