17 May, 2026 | 3:17 PM

ధాన్యం కొనుగోళ్లు అలసత్వంపై రైతుల నిలదీత

17-05-2026 02:37 PM

హమాలీలు లేకుండా తూకం ఎలా వేస్తారు అంటూ నిలదీసిన రైతులు

రెండు రోజులు గడువు కోరిన చైర్మన్

కొల్చారం(విజయక్రాంతి): రంగంపేట సహకార సంఘంలో ధాన్యం కుప్పలు పోసి నెలరోజులు గడుపుతున్న తూకం వేయడం లేదని రైతులు సహకార సంఘం చైర్మన్ అరిగె రమేష్, సహకార సంఘం సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంపేట కొనుగోలు కేంద్రం వద్ద సుమారు వందల ధాన్యం నిల్వ ఉన్నప్పటికీ హమాలీలు లేకపోవడంతో  తూకం వేయడంలో జాప్యం జరుగుతుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ముందస్తు ప్రణాళిక లేకుండా అవసరమైన హమాలీలను ఏర్పాటు చేసుకోకుండా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ రైతుల ఆగ్రహం వ్యక్తం చేశారు. రోజుకు ఒక లారీ కూడా తూకం వేయడం లేదని ఇదే పరిస్థితి కొనసాగితే రెండు నెలలైనా ధాన్యం రాశులు ఇలానే ఉంటాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అదనపు హమాలీలను ఏర్పాటు చేసి లారీలు వచ్చేలా చూడాలని లేకుంటే ఆందోళన చేపట్టినట్లు రైతులు కాంగ్రెస్ నాయకులు చైర్మన్ ను నిలదీశారు. రెండు రోజులు సమయం ఇవ్వాలని రెండు రోజుల్లో అదనపు హమాలీలను ఏర్పాటు చేసి తూకం వేగవంతం చేసేలా చర్యలు తీసుకోనున్నట్లు చైర్మన్ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు.