లోక్ అదాలత్‌లో 8344 కేసుల పరిష్కారం: ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్
మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District)లో నిర్వహించిన జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం(National Mega Lok Adalat Program)లో 8344 కేసులకు పరిష్కారం లభించినట్లు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్(SP Sudhir Ramnath Kekan) తెలిపారు. జిల్లా పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదు అయిన అండర్ ఇన్వెస్టిగేషన్, కోర్టు విచారణలో ఉన్న ఐపీసీ కేసులు 641, 27 సైబర్ క్రైం కేసులు, 1,124 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, 5,465మోటార్ వెహికల్ యాక్ట్, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులు, 1,087 ఈ పెట్టి కేసులు రాజీ మార్గాన పరిష్కరించడం జరిగిందని చెప్పారు.
జాతీయ మెగా లోక్ అదాలత్ లో జిల్లా పరిధిలో రాజీ మార్గమే రాజమార్గంగా కేసుల పరిష్కారానికి పోలీస్ అధికారులు, సిబ్బంది పకడ్బందీగా వ్యవహరించి నిందితులు, కక్షిదారులకు సమాచారం అందించి వారికి అవగాహనా కల్పించి లోక్ అదాలత్ లో పరిష్కరించుటకు కృషి చేశారని ఎస్పీ తెలిపారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో 8344 కేసులు పరిష్కరించడం జరిగిందని, కేసులను పరిష్కరించడంలో చక్కగా వ్యవహరించిన పోలీస్ అధికారులను, సిబ్బందిని, కోర్టు కనిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ అభినందించారు. పోలీస్ అధికారులను, కోర్టు కానిస్టేబుల్లను ప్రతి రోజు మానిటరింగ్ చేస్తూ కేసుల పరిష్కరంలో కృషి చేసిన డీఎస్పీలు తిరుపతి రావు, కృష్ణ కిషోర్, డిసిఆర్బి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, జిల్లా పరిధిలోనీ సీఐలు, ఎస్ ఐలు, కోర్ట్ మానిటరింగ్ ఎస్.ఐ జీనత్ ను ప్రత్యేకంగా అభినందించారు.






