13-02-2026 12:00:00 AM
బిల్లులు చెల్లించాలని పాలసంఘాల చైర్మన్లు, రైతులు డిమాండ్
ఎల్బీనగర్, ఫిబ్రవరి 12 : పాల బిల్లులు చెల్లించడం లేదని రైతులు, పాల సంఘాల చైర్మన్లు గురువారం మదర్ డెయిరీకి తాళం వేసి, ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా డైరెక్టర్లు భాస్కర్‌గౌడ్, రాంరెడ్డి మాట్లాడుతూ... మదర్ డైయిరీకి అనుబంధంగా మొత్తం 311 పాల సంఘాల్లో 35 వేల రైతులు నిత్యం పా లు పోస్తున్నారన్నారు.
రైతులకు నాలుగు నెలలకు 9 బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని, మొత్తం రూ, 25 నుంచి 27 కోట్లు రైతులకు చెల్లించాల్సి ఉందన్నారు. బిల్లులు చెల్లించని చైర్మన్, పాలకవర్గం రాజీనామా చేయాలని, పాలనా పగ్గాలను పాల సంఘాలకు అప్పగిస్తే మదర్ డెయిరీని కాపాడుతామన్నారు.
20 తేదీన చెల్లిస్తాం: ఎండీ లింగారెడ్డి
రైతులకు పాల బిల్లులు చెల్లించాల్సి ఉం దని, ఈ నెల 20వ తేదీన బిల్లులు చెల్లిస్తామని మదర్ డెయిరీ ఎండీ లింగారెడ్డి హామీ ఇచ్చా రు. ఈ నెలాఖరులోగా పాలక వర్గం సర్వసభ్య సమావేశం నిర్వహిస్తామన్నారు. ఎమ్మెల్యేలతో కలిసి చైర్మన్ మధుసూదన్‌రెడ్డి త్వరలో సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తారని తెలిపారు. కార్యక్రమంలో మాజీ డైరెక్టర్లు సోమిరెడ్డి, వెంకట్‌రెడ్డి, భిక్షపతి, పాల సంఘాల చైర్మన్లు పాల్గొన్నారు.