15 June, 2026 | 10:00 PM

Breaking News

భారీ ఈదురుగాలులకు పారాబాయిల్డ్ రైస్ మిల్ ధ్వంసం   •   చిన్నారి పిల్లల రక్షణ కే బేబీ కేర్: ఎంపీ గోడం నగేష్   •   250 గ్రాముల గంజాయితో యువకుడు అరెస్ట్   •   వడ్డెర సంఘం అధ్యక్షుడిగా కొమ్మరాజుల సురేష్   •   ఆటోను ఢీకొట్టిన ఇసుక లారీ   •   నకిలీ విత్తనాల దందాను అడ్డుకున్నందుకే హత్యాయత్నం..?   •   పెద్దపల్లి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడిగా జడల సురేందర్ ఏకగ్రీవం   •   కామారెడ్డి జిల్లాలో బీఎల్ఏ, సర్ మ్యాపింగ్ 90 శాతం పూర్తి   •   ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రాథమిక లక్ష్యం: కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్   •   ఉద్యానవన పంటల సాగు విస్తీర్ణం పెంచాలి: జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా   •  

ముస్లిం స్మశానవాటిక కాంపౌండ్, కమ్యూనిటీహాల్ కోసం ఎమ్మెల్యేకు వినతి

13-02-2026 12:00 AM

శ్రీరంగాపూర్ ఫిబ్రవరి 12: శ్రీరంగాపురం మండలంలో మాసం శాఖాద్రి దుర్గా ఉన్న ముస్లిం స్మశాన వాటికకు రక్షణ గోడ (కాంపౌండ్ వాల్), నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ ముస్లిం మైనారిటీ నాయకులు మండల కాంగ్రెస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీహరి రాజు ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డిని కలిసి వినతిపత్రం స మర్పించారు.

ఈ సందర్భంగా ఇస్ మజీద్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ వహీదుద్దీన్ మాట్లాడు తూ, స్మశాన వాటికకు కాంపౌండ్ లేకపోవడంతో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, భ ద్రతా సమస్యలు తలెత్తుతున్నాయని వివరించారు. సమాజానికి అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు కాంపౌండ్ వాల్ అత్యవసరమని తెలిపారు.అలాగే ముస్లిం సమాజ సమావేశాలు, సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రత్యేక కమ్యూనిటీ హాల్ నిర్మాణం అవసరమని పే ర్కొన్నారు.

ప్రస్తుతం సరైన వసతులు లేకపోవడంతో కార్యక్రమాలు నిర్వహించడంలో ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు.వినతిపత్రం స్వీకరించిన ఎమ్మెల్యే మెగా రెడ్డి సమస్యలను పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సంబంధిత అధికారులతో చర్చించి అవసరమైన నిధులు మంజూరు చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొన్నారు.