4 August, 2026 | 1:56 AM

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించాలి

04-08-2026 12:00 AM

ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి

గద్వాల టౌన్, ఆగస్టు 3: గద్వాలలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం విద్యుత్ శాఖ అధికారులతో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాకాలంలో రైతులకు ఎలాంటి అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. సబ్స్టేషన్ల పనితీరు మెరుగుపరచడంతో పాటు ఓవర్, లో వోల్టేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని, గ్రామాల్లో లైన్మెన్లు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని సూచించారు. సమావేశంలో విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.