4 August, 2026 | 1:46 AM

కరాటే పోటిల్లో కిట్స్ విద్యార్థినికి బంగారు పతకం

04-08-2026 12:00 AM

కోదాడ, ఆగస్టు 3 : కోదాడ లోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థి నికి ఖమ్మం లో నిర్వహించిన నేషనల్ ఛాంపియన్షిప్ కరాటే పోటిల్లో  బంగారు పతకం సాధించినట్లు కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ పోటిల్లో బీటెక్ ఎలక్టికల్ మరియు ఎలక్ట్రానిక్స్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఎం. అంజలి బంగారు పతకం సాధించడం తమ కళాశాలకు గర్వ కారణం అన్నారు.

ప్రతిభ కనబరిచి బంగారు పతకం సాధించిన విద్యార్థినిని కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ అభినందించారు. ఈ కార్యక్రమం లో ప్రతిభ కనపర్చిన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పెరుమాళ్ళపల్లి గాంధీ, ఎలక్ట్రికల్ విభాగాధిపతి డాక్టర్ శివాజీ, విభాగాదిపతులు, అధ్యాపకులు, కరాటే శిక్షకులు మాధవి లత పాల్గొన్నారు.