5 June, 2026 | 1:13 AM

రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి

05-06-2026 12:00 AM

ధాన్యం, మక్కల కొనుగోలు వెంటనే చేపట్టాలి

కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో మహా ధర్నా

టీఆర్‌ఎస్ (డి) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ

ముషీరాబాద్, జూన్ 4 (విజయక్రాంతి): రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర, ధాన్యం, మక్క కొనుగోలు లేదని,  వెంటనే చేపట్టాలని టీఆర్‌ఎస్ (డి) పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నరాల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఈ మేరకు గురువారం ఇందిరాపార్క్ ధర్నా చౌక్ లో టిఆర్‌ఎస్ (డి) పార్టీ ఆధ్వర్యంలో రైతులకు గిట్టుబాటు ధర, ధాన్యం, మొక్క కొనుగోలును వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా నిర్వహించారు. ధాన్యం, మక్కాలు కొనుగోలు చేపట్టడం లేదన్నారు. మహిళలకు 2500, మహిళలకు తులం బంగారం, 5,500 లకు గ్యాస్ సిలిండర్ ఇస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ హామీ ఇచ్చిందని, ఆ హామీలు నేడు తుంగలో తొక్కిందన్నారు.

ఆసరా పెన్షన్ 40 శాతం మంది వృద్ధులకు అందడం లేదన్నారు. రైతు రుణమాఫీ రెండు లక్షలు 60 శాతం అమలు కాలేదన్నారు. యువ వికాసం పథకం ద్వారా ఐదు లక్షల విద్యార్థులకు విద్యా భరోసా కార్డు ఇస్తామని ఇవ్వలేదన్నారు. అదే విధంగా ఇందిరమ్మ ఇండ్లు ప్రతి నియోజకవర్గానికి 4000 ఇస్తామని చెప్పి కనీసం 1000 ఇండ్లు కూడా నిర్మించలేదని ఆయన ఆరోపించారు.

ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.  ఈ మహా ధర్నాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోడేటి శంకర్ గౌడ్ తో పాటు రైతులు నాయకులు పాల్గొన్నారు.