7న కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలకు శిక్షణ
05-06-2026 12:00 AM
తాండూరు, జూన్ 4 (విజయక్రాంతి) ఈనెల ఏడవ తేదీ ఆదివారం వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గ స్థాయి కాంగ్రెస్ పార్టీ బి ఎల్ ఏ ల శిక్షణ శిబిరం ఉంటుందని సర్( స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఆ పార్టీ నియోజకవర్గ సర్ ఇన్చార్జి కర ణం పురుషోత్తం రావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు. శిక్షణ శిబిరానికిరాష్ట్ర కన్వీనర్,పరిగి ఎమ్మెల్యే టి. రాం మెహన్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, డిసిసి అధ్యక్షులు ధారసింగ్ తదితరులు పాల్గొంటారని. పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని కోరారు.






