నేడు నగరంలో టీపీసీసీ చీఫ్, రాష్ట్ర మంత్రుల పర్యటన
05-06-2026 12:00 AM
- రాజీవ్ చౌక్ సుందరీకరణ పనులకు శ్రీకారం
- నూతన ఫుడ్ కోర్టుల నిర్మాణానికి శంకుస్థాపన
ముకరంపుర, జూన్ 4 (విజయక్రాంతి): నగరంలో టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లు శుక్రవారం పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అధ్యక్షతన సుడా నిధులతో రాజీవ్ చౌక్ సుందరీకరణ పనుల ప్రారంభం, స్వర్గీయ రాజీవ్ గాంధీ నూతన కాంస్య విగ్రహ ఆవిష్కరణ, ఐడిఎస్‌ఎంటి ప్రారంభోత్సవం, నూతన ఫుడ్ కోర్టులకు శంకుస్థాపన తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నట్లు ఎమ్మెల్యే, డిసిసి అధ్యక్షుడు మేడిపల్లి సత్యం తెలిపారు.






