8 April, 2026 | 11:20 PM

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం కోసం రైతుల ఆందోళన

08-04-2026 09:30 PM

మెట్ పల్లి,(విజయక్రాంతి): మెట్ పల్లి సబ్ డివిజన్ పరిధిలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభం చేయాలని కోరుతూ మెట్ పల్లి పట్టణంలోని పాత బస్ స్టాండ్ వద్ద బుధవారం రైతులు ఆందోళనకు దిగారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాకా రైతులు తక్కువ ధరకు పంటలను అమ్ముకొని నష్ట పోతున్నామాని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని కలెక్టర్ కు తెలిపిన ఇప్పటి వరకు స్పందన లేదని అన్నారు.

అకాల వర్షలకు రైతులు మరింత నష్టం జరిగే అవకాశం ఉందని, వెంటనే ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు ప్రారంభం చేయకుంటే ఆందోళన లు తీవ్ర తరం చేస్తామని హెచ్చరించారు.రైతుల ఆందోళన తో పాత బస్ స్టాండ్ నుండి డిపో వరకు, అటు కొత్త బస్ స్టాండ్ వరకు ట్రాఫిక్ నిలిచి పోయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న పోలీస్ లు, రెవెన్యూ అధికారులు ఆందోళన ప్రాంతానికి వచ్చి రైతులకు హామీ ఇవ్వడం తో రైతులు ఆందోళన విరమించారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి, మల్లాపూర్, ఇబ్రహీంపట్నం రైతులు పాల్గొన్నారు.