లారీ ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలు
ఆళ్ళపల్లి,(విజయక్రాంతి): లారీ ఢీకొని ఒకరు తీవ్ర గాయాల పాలైన ఘటన ఆళ్లపల్లి స్టేషన్ పరిధిలోని బాటన్న నగర్ లో చోటు చేసుకుంది. మండల పరిధిలోని రాఘవపురం గ్రామానికి చెందిన ఆలం మల్లేష్ వయసు (45) ఉదయం గుండాల మండలం సాయనపల్లి గ్రామానికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమంలో బాటన్న నగర్ సమీపాన మూలమలుపు వద్ద మూత్ర విసర్జన కోసం తన ద్విచక్ర వాహనాన్ని ఆపుకొని ఉండగా ఇల్లందు నుండీ గుండాల వెళ్ళే లారీ ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని, ఢీకొనడంతో మల్లేష్ కుడి కాలు విరిగింది. అటుగా వెళ్తున్న వ్యక్తులు 108 కి సమాచారం అందించడంతో 108 వాహన సిబ్బంది పరమ సునీల్ కుమార్ , ఈఎంటి శఆకాష్ హుటాహుటిన ఘటనస్థలికి చేరుకొని క్షతగాత్రుడు మల్లేష్ కి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించడం జరిగింది.






