28 February, 2026 | 1:58 PM

యూరియా సమస్యపై రైతుల ఆందోళన

28-02-2026 12:07 PM
  1. ఇందల్యాయి పీఏసీఎస్ ఎదుట రైతుల ధర్నా
  2. యాప్ రద్దు చేసి, నేరుగా విక్రయించాలని డిమాండ్
  3. 15 రోజులుగా యూరియా కోసం పడిగాపులు

హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి పీఏసీఎస్ ఎదుట రైతులు(Farmers Protest) ధర్నాకు దిగారు. యూరియా సమస్యలు పరిష్కరించాలని రైతులు ఆందోళన చేస్తున్నారు. యూరియా యాప్ రద్దు చేసి నేరుగా విక్రయించాలని డిమాండ్ చేస్తున్నారు. 15 రోజులుగా యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సొసైటీలు, ప్రైవేటు దుకాణాల్లో యూరియా దొరకట్లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాప్ లో చూపించిన సెకన్లలోనే యూరియా అయిపోవడంపై రైతులు మండిపడుతున్నారు.