ప్రత్యామ్నాయ పంటలను రైతులు వేసుకోవాలి
చొప్పదండి,(విజయక్రాంతి): చొప్పదండి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో పిఎసిసి ఛైర్మెన్ రైతులకు ఎల్నినో ప్రభావం - ప్రత్యామ్నాయ పంటలపై రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎల్నినో ప్రభావం వలన మండలంలో వర్షపాతం నమోదు అయినదని గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షానికి రైతులు నాట్లు వేసుకుంటున్నారు. కానీ ఈ వర్షపాతం వరి సాగుకు సరిపోదు అని, కావున రైతులు గమనించి వరి సాగు తక్కువగా చేసుకోవాలని వరినాట్లు బదులుగా ఆరుతడి పంటలు, పప్పుదినుసులు వైపు మొగ్గచూపుపాలని తెలిపారు.
నీరు తక్కువగా అవసరమయ్యే పంటలు అయినట్టి పెసర,కంది, నూనెగింజ పంటలు, కూరగాయలు లాంటి ఆరుతడి పంటలు వరి పంటకు బదులుగా ప్రత్యామ్నయ పంటలుగా, సేంద్రియ వ్యవసాయం సాగు పై రైతులు దృష్టి సారించాలని తెలిపారు. సమావేశంలో పాక్స్ ఛైర్మెన్ ఇప్ప శ్రీనివాస్ రెడ్డి గా, చొప్పదండి మమత గా, సీఈఓ తిరుపతి రెడ్డి గారు, మున్సిపల్ కౌన్సిలర్లు,AEOs రమ్య జోత్స్నా , మండలంలోని వెదురుగట్ట రైతు వేదిక , దేశాయ్ పేట,గుమ్లాపూర్, సాంబయ్యపల్లి గ్రామాలలో రైతులకు AEOs వివారించారు. ఇందులో భాగంగా అధికారులు సంపత్ , భావన, యోగేశ్వర్ , కవిత మరియు ఇతర శాఖల అధికారులు, వివిధ గ్రామాలలో ఆయా గ్రామ సర్పంచ్ లు, ప్రజా ప్రతినిదులు మరియు రైతులు పాల్గొన్నారు.






