సీఎం దిష్టిబొమ్మ దహనం చేసిన బీజేవైఎం నాయకులు
01-08-2026 08:08 PM
నిరసనకారుల అరెస్టు
కోదాడ,(విజయక్రాంతి): కోదాడ పట్టణం రంగా థియేటర్ చౌరస్తాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలి అని గిరిజన మోర్చా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బాదావత్ బాలాజీ నాయక్, భారతీయ జనతా యువ మోర్చా కన్వీనర్ ఏపూరి గణేష్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ శనివారం దహనం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పోలీసులకు బీజేవైఎం నాయకులకు మధ్య తోపులాట జరిగింది. బీజేవైఎం నాయకులను అరెస్టు చేసి టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు.






