25 July, 2026 | 12:47 AM

రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి

25-07-2026 12:11 AM

ఏఈఓ నిమ్మ పిచ్చయ్య

కోదాడ, జూలై 23: రైతులు ఆరుతడి పంటలు సాగు చేసుకోవాలి ఏఈఓ నిమ్మ పిచ్చయ్య అన్నారు. శుక్రవారం కోదాడ మండల పరిధిలోని రామలక్ష్మి పురం గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ గంగిరెడ్డి తులిశమ్మ కన్నా రెడ్డి అధ్యక్షతన రైతులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాలు లేకపోవడం ప్రాజెక్టులలో సమృద్ధిగా నీరు లేనందున రైతులు ప్రత్యామ్నాయ పంటలైన పెసర బొబ్బర మొక్కజొన్న కూరగాయలు తదితర ఆరుతడి పంటలు తక్కువ నీటితో సాగు చేసే పంటలు వేసుకోవాలని బోర్లు బావల కింద వరివేసే రైతులు కూడా సాధ్యమైనంత వరకు వరి తగ్గించి ప్రత్యామ్నాయం వైపు వెళ్లాలని తెలిపారు.

ఇట్టి కార్యక్రమంలో కౌలు రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్యం పాపిరెడ్డి పంచాయతీ కార్యదర్శి ఉపేందర్ సంఘ బంధం అధ్యక్షురాలు జ్యోతిరాణి రైతులు వెంకట్ రెడ్డి సత్యనారాయణరెడ్డి కృష్ణారెడ్డి నరసింహారెడ్డి కొండలు సీతమ్మ రైతులు పాల్గొన్నారు.