ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి
హుజూర్ నగర్: ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలోని హుజూర్ నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరణ ప్రకారం పట్టణంలోని వయసు ముత్యాలమ్మ గుడి వద్ద కుంభం కాటయ్య(42) గానుగ చెట్టు కింద నిద్రిస్తుండగా పట్టణానికి చెందిన లింగం వీరబాబు తన ట్రాక్టర్ ను రివర్స్ చేస్తుండగా చెట్టు కింద నిద్రిస్తున్న కాటయ్యను చాతి భాగంలో ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడని... మృతి చెందిన కాటయ్యకు భార్య ఇద్దరు పిల్లలు, మృతుడి భార్య కుంభం వీరమ్మ ఫిర్యాదు మేరకు ఏఎస్ఐ బలరాంరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇదిలా ఉండగా మృతి చెందిన కాటయ్య కుటుంబం భిక్షాటన చేస్తూ జీవనం కొనసాగిస్తుండడంతో ఇంటికి పెద్ద దిక్కుఅయినా కాటయ్య మృతితో కుటుంబ సభ్యులు బంధువులు కాలనీవాసులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.






