రైతులు ఆరుతడి పంటలు వేసుకోవాలి
మండల వ్యవసాయ అధికారి ప్రజాపతి
సదాశివానగర్,(విజయక్రాంతి): మండల కేంద్రంలో సోమవారం రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆరుతడి పంటలు, కూరగాయల విత్తనాల మేళా నిర్వహించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచే ఉద్దేశంతో 2026 జూలై 27 నుండి 29 వరకు రైతు వేదికలో విత్తనాల మేళా నిర్వహించబడుతుందనీ వ్యవసాయ అధికారి తెలిపారు. ఈ విత్తనాల మేళాలో మొక్కజొన్న (Maize), కందులు (Redgram), పెసలు (Greengram), మినుములు (Blackgram) ప్రత్తి (కాటన్)తో పాటు వివిధ రకాల కూరగాయల పంటల విత్తనాలు రైతులకు అందుబాటులో ఉంటాయన్నారు.
రైతులు తమ అవసరాలకు అనుగుణంగా నాణ్యమైన, ధృవీకరించబడిన విత్తనాలను కొనుగోలు చేసుకొని, ఖరీఫ్ సాగుకు సకాలంలో వినియోగించుకోవాలన్నారు.భూగర్భ జలాలు కూడా చాలా తగ్గి పోతున్నాయనీ కావున రైతులు వరి పంట బదులుగా ఆరుతడి పంటలు వేసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారులు పంటల ఎంపిక ప్రభుత్వ పథకాలపై రైతులకు అవగాహన కలిపించునున్నారు. సదాశివనగర్ మండలంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జూలై 27, 28, 29 తేదీలలో సదాశివనగర్ రైతు వేదికలో నిర్వహించే విత్తనాల మేళాకు అధిక సంఖ్యలో హాజరై నాణ్యమైన విత్తనాలను పొందవలసిందిగా మండల వ్యవసాయ అధికారి విజ్ఞప్తి చేశారు.






