రైతులు బ్యాంక్ సేవలను సద్వినియోగం చేసుకోవాలి
కేడీసీసీ బ్యాంక్ సొంత భవనం ప్రారంభం..
ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ
బెజ్జంకి జూలై15: రైతులకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలనే లక్ష్యంతో సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో నిర్మించిన కేడీసీసీ బ్యాంక్ సొంత భవనాన్ని బుధవారం స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ప్యాక్స్‌చైర్మన్ తన్నీరు శరత్ రావుతోకలిసి ఘనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ, సహకార బ్యాంకులు రైతులకు ఆర్థికంగా అండగా నిలుస్తూ వ్యవసాయాభివృద్ధికి కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. రైతులు బ్యాంక్ అందిస్తున్న పంట రుణాలు, పొదుపు పథకాలు, ఇతర ఆర్థిక సేవలను సద్వినియోగం చేసుకుని తమ వ్యవసాయాన్ని మరింత అభివృద్ధి చేసుకోవాలని సూచించారు.
కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ తన్నీరు శరత్ రావు మాట్లాడుతూ, సొంత భవనం ద్వారా రైతులకు, ఖాతాదారులకు మరింత నాణ్యమైన సేవలు అందించే అవకాశం కలుగుతుందని తెలిపారు. సహకార బ్యాంకుల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రైతుల అవసరాలకు అనుగుణంగా సేవలను విస్తరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పులి కృష్ణ, సిఓ సత్యనారాయణ రావు, పాక్స్ సీఈఓ వాసు, కాంగ్రెస్ నాయకులు ఒగ్గు దామోదర్, లింగాల శ్రీనివాస్,పోచయ్య, ఐలేని శ్రీనివాస్ రెడ్డి, రావుల నర్సయ్య, జల్ల ప్రభాకర్, బోయినీ ప్రశాంత్, బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్, బ్యాంక్ సిబ్బంది బుచ్చయ్య, ఆంజనేయులు, రైతులు, ప్రజలు పాల్గొన్నారు.






