calender_icon.png 16 February, 2026 | 11:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో రైతులకు నష్టం

16-02-2026 12:18:00 AM

ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ  

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: అమెరికాతో ఖరారైన వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తే పత్తి రైతులు, జౌళి ఉత్పత్తుల ఎగుమతి దా రులకు నష్టం జరుగుతుందని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ మధ్య వాణిజ్య ఒప్పందం ద్వారా దేశ పత్తి రైతులు, జౌళి ఉత్పత్తుల ఎగుమతి దారులను మోసగిస్తున్న మోదీ ప్రభుత్వం.. ప్రజల్లో గందర గోళం సృష్టిస్తోందని తాజాగా తన ‘ఎక్స్’ ఖాతాలో ఆరోపించారు. అమెరికా మాయ లో పడ్డ మోదీ సర్కారు విధానాల వల్ల లక్షల మంది ఉపాధి కోల్పోతారని తెలిపారు.

పొరుగుదేశం బంగ్లాదేశ్ నుంచి జౌళి ఉత్పత్తుల ఎగుమతులపై జీరో సుంకం ఉంటే, మన దేశ జౌళి ఉత్పత్తుల ఎగుమతులపై అమెరికా 18 శాతం దిగుమతి సుంకం విధిస్తోందని, ఇదే ప్రధాని మోదీ అబద్ధాలకు నిదర్శనమని రాహుల్ ఆరోపించారు.  ఇది తాత్కాలిక అంశం కాదని, రైతుల భవిష్యత్తుకు సంబంధించిన అంశమని రాహుల్ పేర్కొన్నారు. భారత వ్యవసాయ రంగంపై మరో దేశం పట్టును సాధించేందుకు అనుమతి ఇస్తున్నామా? అని ఈ సందర్భంగా అనుమానం వ్యక్తం చేశారు.